AP News:‘జగన్ భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసింది’..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News:‘జగన్ భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసింది’..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ప్రస్తుతం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు సెక్యూరిటీ అంశం పై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల వైఎస్ జగన్ భద్రత కుదింపు పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో నేడు (బుధవారం) జగన్ భద్రత అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అవసరమైనప్పుడు భద్రత పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అంబటి రాంబాబు అన్నారు. కానీ..నేడు అందుకు విరుద్ధంగా పరిస్థితులు చోటుచేసుకున్నాయని అన్నారు.

వైఎస్ జగన్ అధికారం నుంచి దిగిపోయాక ఆయనపై కక్ష గట్టినట్టు వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సెక్యూరిటీ రివిజన్ కమిటీ (SRC) నివేదిక రాకముందే మాజీ సీఎం జగన్ సెక్యూరిటీని ఉపసంహరించుకున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. జగన్ నివాసం గేటు వద్ద ఉన్న సెక్యూరిటీని తీసేశారని, ఆ రోడ్డులోకి విచ్చలవిడిగా అందరినీ అనుమతించారని వివరించారు. కూటమి కార్యకర్తలను పంపించి ఆ గేటు వద్ద గొడవలు చేయించారని మండిపడ్డారు. ఆయన భద్రతను గాలికొదిలేశారని విమర్శించారు. జగన్‌కు ఏదేనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని అంబటి రాంబాబు అన్నారు. ఇటీవల ఏపీలో నెలకొంటున్న పరిస్థితుల దృష్ట్యా వైఎస్ జగన్‌కు సెక్యూరిటీ అంశం పై న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

Advertisement

Next Story