మత్స్యకారులను ఆదుకొంటాం.. హామీ ఇచ్చిన ఆ పార్టీ నేత

by Indraja |
మత్స్యకారులను ఆదుకొంటాం.. హామీ ఇచ్చిన ఆ పార్టీ నేత
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఆదివారం విశాఖ ఫిషింగ్ హార్చర్ ను విశాఖ దక్షిణ నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధి వాసుపల్లి గణేష్, విశాఖ లోక్ సభ ఎంపీ అభ్యర్ధి బొత్స ఝాన్సీ సందర్శించారు. ఈ నేపథ్యంలో విశాఖ లోక్ సభ ఎంపీ అభ్యర్ధి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత్స్యకారులను వైసీపీ అదుకొంటుందని తెలిపారు. మత్స్యకారులకు చేయూతనిచ్చేందుకు మరిన్ని సంక్షేమ పథకాలను వైసీపీ అమలు జరుపుతుందని హామీ ఇచ్చారు.

ఇక మత్స్యకారులకు వైసీపీ మొదటి నుంచి అండగా ఉందని పేర్కొన్నారు. అలానే ఫిషింగ్ హార్బర్ లో అమ్మకానికి పెట్టిన రకరకాల చేపలను పట్టుకొని వాటి వివరాలను అడిగి తెలుసుకొన్నారు.

Advertisement

Next Story