- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు షాకిచ్చిన మహిళలు.. ఎందుకొచ్చావంటూ నిలదీత
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్ : ‘గడపగడపకు.. మన ప్రభుత్వం’ అనే కార్యక్రమంతో గ్రామాల్లో పర్యటిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలను జనం ఎక్కడపడితే అక్కడ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సింహాచలంలో మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావును మహిళలు అడ్డుకున్నారు. ఇవాళ శనివారం ఉదయం సింహాచలంలో విజినిగిరి పాలెంలో నిర్వహించిన గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. అయితే, పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించకుండా మా దగ్గరికి మళ్లీ ఓట్లు అడిగేందుకు వచ్చావా.. అంటూ ఎమ్మెల్యే అవంతిని అడ్డుకోగా ఆయన ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో ఆయన మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Advertisement
Next Story