- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశమంతా రామమయం.. ఆంధ్రప్రదేశ్ దొంగలమయం : బీజేపీ నేత భానుప్రకాష్ ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : అయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్టతో దేశంమంతా రాయమయం అయిందని, ఆంధ్రప్రదేశ్ మాత్రం దొంగలమయంగా మారిందంటూ బీజేపీ ముఖ్య నాయకులు భానుప్రకాష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా దొంగ ఓట్లను చేర్చారని వాటికి సంబంధించి ఎపిక్ కార్డులను ఈఆర్వో వెబ్‌సైట్ నుంచి 34వేల కార్డులను అక్రమంగా డౌన్‌లోడ్ చేసుకున్నారని అరోపించారు. అందుకు సంబంధించిన వ్యవహారంపై బీజేపీ పూర్తి అధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో జరిగిన ఘటనపై కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని విచారణ చేపట్టాలని ఆదేశించింది. విచారణ ప్రారంభమైనా ఇప్పటి వరకు బాధ్యులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నిందితులను తప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో అధికార పార్టీ నాయకులకు పూర్తిగా సహకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు మంచివి కావని పేర్కొన్నారు. దొంగ ఓట్లతో గెలిచిన వైసీపీ ఎంపీ గురుమూర్తిని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.