- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేశినేని నాని ఓ ఊసరవెల్లి.. బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. విజయవాడ ఎంపీ సీటు విషయంలో సొంత తమ్ముడి చిన్నితో విభేదాలు తలెత్తడంతో కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం సీఎం జగన్‌ను కలిసి విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించుకున్నారు. దీంతో కేశినేని నాని వర్సెస్ టీడీపీ నేతలుగా విజయవాడలో రాజకీయం మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ టార్గెట్‌గా కేశినేని నాని శుక్రవారం ఉదయం విమర్శలు చేశారు. దీంతో కేశినేని నానికి టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా కేశినేని నానిపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘కేశినేని నాని ఓ ఊసరవెల్లి. 2009 నుంచి 2024 మధ్య కాలంలో కేశినేని నాని మూడు పార్టీలు మారారు. టీడీపీ, వైసీపీ ఇలా మూడు పార్టీల్లో చేరారు. 2014 నుంచి కేశినేని నానిని పక్కన పెట్టడం జరిగింది. 2014 గెలిచిన ఎంపీలకే 2019లోనూ చంద్రబాబు మరోసారి అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి కేశినేనిలో శాడిజం పెరిగింది. అంతకుముందు చంద్రబాబుపై విమర్శలు చేశారు. శాడిజం మరింత పెరగడంతో సొంత పార్టీ నేతలపై ట్విట్టర్‌లో విమర్శలు చేయడం మొదలు పెట్టారు. కేశినేని నానికి ఈ సారి ఎన్నికల్లో టికెట్ ఇవ్వమని విజయవాడలో ఏ చిన్న పిల్లవాడిని అడిగా చెబుతారు. నోటి దూల వల్లే కేశినేని నానికి టికెట్ ఇవ్వడం లేదని అందరికి తెలుసు.’ అని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.