- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నీటిలో రాజధాని భవనాలు.. పునాదులను పరిశీలించిన నిపుణులు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధానిలో మద్రాస్ ఐఐటీ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. సెక్రటేరియట్, హెచ్ వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతను ఇంజినీర్లు అధ్యయనం చేస్తున్నారు. అయితే కొన్ని భవనాల చుట్టూ నీరు చేరింది. దీంతో పడవలపై వెళ్లి భవన నిర్మాణాల పటిష్టతను నిపుణులు పరిశీలించారు.
ఇటీవల కురిసిన వర్షానికి రాజధాని కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మించిన అమరావతి భవనాలు నీట ముగిగాయి. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిర్మాణాలన్నీ నిలిచిపోయాయి. కొన్ని చోట్ల పాడయ్యాయి. ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ భవనాలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ భవనాల పటిష్టతను తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా భవనాల పటిష్టతను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్, మద్రాస్ ఐఐటీ నిపుణులు బృందాన్ని కోరింది. ఈ మేరకు హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం అమరావతిలో శుక్రవారం పర్యటించింది. పలు భవనాల పటిష్టతపై అధ్యయనం చేసింది. ప్రస్తుతం మద్రాస్ ఐఐటీ నిపుణల బృందం అమరావతిలో పర్యటిస్తోంది. త్వరలో ప్రభుత్వానికి ఈ రెండు నిపుణుల బృందాలు నివేదికను సమర్పించనున్నాయి.