- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రూ. 36 లక్షలతో బాత్ టబ్ .. జగన్ రుషికొండ ప్యాలెస్ వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం హయాంలో విశాఖను రాజధానిగా అప్పటి సీఎం జగన్ ప్రకటించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పరిపాలన చేస్తామని ఎన్నికలకు ముందు తెలిపారు. అయితే అంచనాలు తారు మారు అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ తామే మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో విశాఖ రుషికొండలో విలాసవంతమైన భవనాలు నిర్మించారు. రుషికొండను కొంతభాగం తొలగించి రూ. 500 కోట్ల 7 బ్లాకుల్లో భవనాలు నిర్మించారు.
అయితే ఈ బ్లాకులను ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. గుండె చెదిరే నిజాలు బయటకు వచ్చాయని తెలిపారు. తానే 30 ఏళ్ళ పాటు సీయం అనే పిచ్చలో కేవలం తన కుటుంబం ఉండటం కోసం బీచ్ వ్యూ ప్యాలెస్ కోరికతో రుషికొండని కొట్టేసి జగన్ రెడ్డి కట్టిన రూ.500 కోట్ల రుషికొండ ప్యాలెస్ ఇది అంటూ సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. రూ. 36 లక్షలతో టబ్ బాత్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఈ భవనాలను సంబంధించిన వీడియోను టీడీపీ నేతలు విడుదల చేశారు. గతంలో ఈ భవనాలను చూడడానికి ఎవరినీ అనుమతివ్వలేదని, ప్రస్తుతం తాము చూపిస్తున్నామంటూ, అందరూ చూడాలని సూచించారు.
తానే 30 ఏళ్ళు సియం అనే పిచ్చలో, కేవలం తన కుటుంబం ఉండటం కోసం, బీచ్ వ్యూ ప్యాలెస్ కోరికతో, రుషికొండని కొట్టేసి, జగన్ రెడ్డి కట్టిన రూ.500 కోట్ల రుషికొండ ప్యాలెస్ ఇది.ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా రుషికొండ ప్యాలెస్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పరిశీలిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం… pic.twitter.com/E3kyUNHRCk— Telugu Desam Party (@JaiTDP) November 2, 2024