Raghurama Krishnam Raju : ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

by Seetharam |   ( Updated:2023-07-21 08:41:02.0  )
Raghurama Krishnam Raju : ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ అసమ్మతి నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టు చుక్కెదురైంది.ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ రుణాల కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. గతంలోనే ఈ కేసును హైకోర్టు కొట్టేసినప్పటికీ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అక్కడా భంగపాటు తప్పలేదు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ రుణాలు పొందడంపై సవాల్ చేస్తూ ఎంపీ రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందడం సవాల్ చేయడాన్ని తప్పుబట్టింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పు వెల్లడించిందని గుర్తు చేసింది. ఈ తీర్పు వెల్లడై ఎనిమిది నెలలు కావడంతో ఇప్పుడు ఆ పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పస్టం చేసింది. అనంతరం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

Read more : disha newspaper

Advertisement

Next Story