AP News:ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..ఒకేసారి 96 మంది డీఎస్పీల బదిలీ

by Jakkula Mamatha |
AP News:ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..ఒకేసారి 96 మంది డీఎస్పీల బదిలీ
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో పలువురు డీఎస్పీలపై బదిలీ వేటు పడింది. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 96 మంది డీఎస్పీల బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమల రావు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 57 మందిని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..తాడిపత్రి, రాజంపేటలో వైసీపీ కోసం పనిచేసిన డీఎస్పీ వీఎన్‌కే చైతన్యను బదిలీ చేసింది. అలాగే తుళ్లూరు డివిజన్‌ డీఎస్పీ ఈ.అశోక్‌కుమార్‌ గౌడ్‌ పై వేటు పడింది. అయితే ఇద్దరికీ ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదని సమాచారం. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story