పవన్ కళ్యాణ్‌కు మద్ధతుగా ప్రచారంలో పాల్గొంటా:సీనియర్ హీరోయిన్

by Jakkula Mamatha |   ( Updated:2024-05-01 14:30:19.0  )
పవన్ కళ్యాణ్‌కు మద్ధతుగా ప్రచారంలో పాల్గొంటా:సీనియర్ హీరోయిన్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు వైసీపీ, ఎన్డీయే కూటమి మేనిఫెస్టోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. శనివారం అధికార వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయగా, మంగళవారం కూటమి మేనిఫెస్టోను పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అనంతరం పార్టీలు ప్రచారంలో భాగంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున ఇండస్ట్రీకి చెందిన సినీ నటులు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుణ్ తేజ్, నాగబాబు, హైపర్ ఆది, పృథ్వీరాజ్‌లు ప్రచారం నిర్వహించారు. చిరంజీవి కూడా తమ్ముడి కోసం ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలోనే మరో సీనియర్ హీరోయిన్ పవన్ తరఫున ప్రచారం చేస్తా అంటున్నారు. సీనియర్ హీరోయిన్ ఖుష్బూ తాజాగా ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గతంలో పవన్ తో “అజ్ఞాతవాసి” మూవీలో నటించాను అన్నారు. ఆ సమయంలోనే ఆయన రాజకీయాల్లో ఉన్న ఎప్పుడూ కూడా రాజకీయాల గురించి నా దగ్గర ప్రస్తావన తీసుకరాలేదు అని చెప్పారు. BJP తో పొత్తులో ఉన్నారు కాబట్టి పవన్ పిలిస్తే ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తాను అని నటి ఖుష్బూ తెలిపారు. ఆమె ఒకపక్క సినిమాలు మరోపక్క రాజకీయాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల్లో పవన్ తరఫున ప్రచారం చేస్తానని ఖుష్బూ ప్రకటన చేయడం సంచలనంగా మారింది.

Read More..

పవన్ కల్యాణ్ కు మద్దతుగా.. మరో టాలీవుడ్ హీరో ప్రచారం

Advertisement

Next Story