ఫైల్స్ దగ్ధం చేసింది వారే.. రెవెన్యూ శాఖ విచారణలో సంచలన విషయాలు

by srinivas |
ఫైల్స్ దగ్ధం చేసింది వారే.. రెవెన్యూ శాఖ విచారణలో సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఫైల్స్ దగ్ధం కేసులో రెవెన్యూ శాఖ విచారణను ముమ్మరం చేసింది. విచారణలో పలు కీలక విషయాలు రాబట్టింది. త్వరలోనే చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధం అయ్యాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఉన్నతాధికారులను ఆదేశించింది. దీంతో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా విచారణ చేపట్టారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై పలువురు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫైల్స్ దగ్ధంలో నలుగురు, ఐదుగురి ప్రమేయంపై ఉన్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అగ్ని ప్రమాదానికి కార్యాలయంలో పని చేసే సిబ్బంది ప్రయత్నంగా తెలుస్తోందని చెప్పారు. సగం దగ్ధమైన పలు ఫైల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, ఆ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని సిసోడియా హెచ్చరించారు. అయితే త్వరలోనే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని, క్లోజ్ అయిన ఫైల్స్ రికవరీ చేయడానికి కొంత ఇబ్బంది తప్పదని తెలిపారు. విచారణ కొనసాగుతోందని, మాధవరెడ్డి పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనలో సస్పెన్షన్లతో పాటు అరెస్టులు సైతం ఉంటాయని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed