విశాఖ శారదాపీఠంకు ప్రభుత్వం షాక్.. రూ.225 కోట్ల విలువైన భూమి స్వాధీనం

by srinivas |
విశాఖ శారదాపీఠంకు ప్రభుత్వం షాక్.. రూ.225 కోట్ల విలువైన భూమి స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ శారదాపీఠం(Visakha Sarada Peetha)కు రెవెన్యూ శాఖ షాక్ ఇచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం(YS Jagan)లో శారదాపీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూమి(land)ని స్వాధీనం చేసుకుంది. జగన్ హయాంలో శారదాపీఠానికి విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసకు సమీపంలో రిషికొండకు దగ్గరలో రూ.15 లక్షలకే 15 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే అంత తక్కువ ధరకే ఖరీదైన భూములు ఇవ్వడంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎకరా రూ. 15 కోట్ల విలువ ఉంటే లక్ష రూపాయలకే ఎలా ఇచ్చారనేదానిపై ఆరా తీసింది. రూ. 225 కోట్ల విలువైన భూమిని రూ. 15 లక్షలకే ఇవ్వడంపై దర్యాప్తు చేయాలని రెవెన్యూ శాఖ(Revenue Department)ను ఆదేశించింది. దీంతో ఆ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. శారదాపీఠంకు ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకోవాలని అధికారుల నిర్ణయించారు. ఆ భూమిని పంచనామా చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారాన్ని రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ సిసోడియా(Revenue Special Secretary Sisodia)కు అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed