మొదలైన యంగ్ హీరో కొత్త సినిమా.. నెట్టింట ఫొటోలు వైరల్

by sudharani |   ( Updated:2024-11-23 13:07:02.0  )
మొదలైన యంగ్ హీరో కొత్త సినిమా.. నెట్టింట ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) ప్రజెంట్ వరుస చిత్రాలతో సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘రాపో 22’(Rapo 22)ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’(Miss Shetty Mr. Polishetty) ఫేం డైరెక్టర్ పీ మహేశ్ బాబు(Director P Mahesh Babu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, అనౌన్స్‌మెంట్ ఆకట్టుకున్నాయి. అలాగే.. ఈ సినిమాలో ‘మిస్టర్ బచ్చన్’(Mr Bachchan) ఫేం భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ‘రాపో 22’ను గురువారం గ్రాండ్‌గా పూజా కార్యక్రమంతో లాంచ్ చేశారు చిత్ర బృందం. డైరెక్టర్ గోపిచంద్ మలినేని(Director Gopichand Malineni) కెమెరా స్విచాన్ చేయగా.. హనురాఘవపూడి(Hanuraghavapudi) క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహించారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మూవీ మేకర్స్.


Click Here For Twitter Post..

Advertisement

Next Story

Most Viewed