ఆ ఇంటి రెంట్ ఒక్క రూపాయి! ఆ ఇంట్లో ఉంటున్న పవన్ కళ్యాణ్..ఎందుకంటే?

by Jakkula Mamatha |
ఆ ఇంటి రెంట్ ఒక్క రూపాయి! ఆ ఇంట్లో ఉంటున్న పవన్ కళ్యాణ్..ఎందుకంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల బహిరంగ సభలో పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటా అని పేర్కొన్నారు. ఈ క్రమంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఆయన తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పవన్ నివాసాన్ని తన అభిమాని అయిన ఓదూరి నాగేశ్వరరావు నిర్మించారు. జనసేన పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా పవన్ ఈ నివాసాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ కొత్త బిల్డింగ్‌కి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఉగాది వేడుకలు ఇక్కడే జరుపుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

జనసేనాని పిఠాపురంలో సొంతింటిని నిర్మించుకునే వరకు ఇక్కడే ఉంటారని సమాచారం. ఈ క్రమంలో బిల్డింగ్‌కి తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలిపారు. ఓదూరి నాగేశ్వరరావు పవన్‌కు అభిమాని కావడంతో ఇంటి రెంట్ ఏమీ తీసుకోవడం లేదని తెలిపారు. ఆ భవనానికి ఎలాంటి అద్దె వసూలు చేయను. కేవలం డాక్యుమెంటేషన్ కోసమే నామమాత్రంగా రూ.1 స్వీకరిస్తానని ఓదూరి నాగేశ్వరరావు తెలిపారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మూడంతస్తుల బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌ను పూర్తిగా వాహనాల పార్కింగ్‌కు, ఫస్ట్ ఫ్లోర్‌లో ఆఫీస్ నిర్వహణకు, 2, 3 ఫ్లోర్‌లు కలిపి డూప్లెక్స్ తరహాలో దీన్ని నిర్మించినట్లు తెలిపారు.

Advertisement

Next Story