ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి బ్రేక్

by srinivas |   ( Updated:2024-01-22 06:51:02.0  )
ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి బ్రేక్
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్జీవీ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు మళ్లీ బ్రేక్ పడింది. ఆ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే పిటిషనర్ అభ్యర్థనను ధర్మాసనం ఏకీభవించింది. ‘వ్యూహం‘ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. అంతేకాదు సినిమాను మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించారు. మూడు వారాలు పాటు విచారణ వాయిదా వేస్తూ ఆదేశించింది.

కాగా దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాలో వివాదాస్పద సీన్లు ఉన్నాయని ఆ సినిమాను నిలిపివేయాలని పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రిని, తనను కించపరుస్తూ అసభ్యకర సీన్లు చిత్రీకరించారని పిటిషన్‌లో దాఖలు చేశారు. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సాగింది. ఇరువర్గాలు తమ వాదనలు వినిపించారు. దీంతో సెన్సార్ బోర్డుకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story