ఏపీలో తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు..ఒక్క రోజులో కోట్ల నగదు పట్టివేత

by Indraja |
ఏపీలో తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు..ఒక్క రోజులో కోట్ల నగదు పట్టివేత
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం కొట్టొనుంచినట్లు కనిపిస్తోంది. ఓ వైపు పార్టీల ప్రచారాలు మరో వైపు పోలీసుల తనిఖీలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకపుటిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడు కుయ్యనేలేదు అప్పుడే పోలీసులు తనిఖీల వేట మొదలు పెట్టారు. కేవలం 24 గంటల్లో కోట్ల అక్రమ నగదును పోలీసులు పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే రానున్న ఎన్నికల నేపథ్యంలో నేతలు ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఒక్క రోజులోనే రూ/ 12 .35 నగదును స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు లో రూ/ 7 .23 కోట్ల అక్రమ నగదు స్వాధీనం చేసుకోగా తిరుపతిలో రూ/ 5 .12 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు మాట్లాడుతూ.. ఎన్నికల నేథ్యంలో పార్టీల నేతలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా నిన్న నిర్వహించనిన తనిఖీల్లో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కలిసి రూ/ 12 .35 కోట్ల నగదును పట్టుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆ నగదుకు సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో ఆ నగదును సీజ్ చేసినట్లు వెల్లడించారు. కాగా రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి పార్టీ అడుగులేస్తోంది. ఇందుకోసం ప్రజలను ఆకర్షించేలా ప్రచారాలు చేస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు.

అయితే పార్టీలు నిర్వహిస్తున్న సభలకు ప్రజలు హాజరు కావాలన్న రానున్న ఎన్నికల్లో ఓట్లు పడాలన్నా నోటితో కాదు నోటు అడగాలి అనే ఫినామిన రాజకీయ నేతలది అని విశ్లేషకుల అభిప్రాయం. ఎవరు ఎన్ని నోట్లు ఇస్తారు అనే దానిపైన విజయం ఆధారపడి ఉంటుందనే గిడ్డి నమ్మకంతో రాజకీయ నేతలు అడుగులేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed