- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP ప్రజలకు భారీ శుభవార్త.. మరో 75 అన్న క్యాంటీన్లు స్టార్ట్.. ముహూర్తం ఖరారు!
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 100 అన్నక్యాంటీన్లు నడుస్తోన్న విషయం తెలిసిందే. ఉప్మా, పొంగల్, పూరీ, ఇడ్లీ వంటి ఐటెమ్స్ బ్రేక్‌ఫాస్టుగా 5 రూపాయలకే అందుబాటులో ఉన్నాయి. పూరీ మూడు, ఇడ్లీ మూడు అండ్ పొంగల్, ఉప్మా 250 గ్రాములు ఇస్తున్నారు. భోజనంలో అన్నం, కూర, పెరుగు, పచ్చడ ఇస్తున్నారు. ఈ సదుపాయం మార్నింగ్ 7. 30 గంటల నుంచి టిఫిన్స్, మధ్యాహ్నం 12. 30 నుంచి 3 గంటల వరకు, నైట్ 7. 30 నుంచి రాత్రి 9 వరకు ఉండనుంది. ఈ క్రమంలోనే మరిన్ని అన్న క్యాంటన్లు అందుబాటులోకి రానున్నాయని నేడు (సోమవారం) ఉదయం మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతం ఈ విషయాన్ని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే నెల (సెప్టెంబరు) 13 వ తారీకున రాష్ట్ర వ్యాప్తంగా మరో 75 అన్న క్యాంటీన్లను స్టార్ట్ చేయనున్నామని వెల్లడించారు.