- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో మహిళలకు ఫ్రీ బస్..తేదీ ప్రకటించిన మంత్రి
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం హామీల్లో భాగంగా కర్ణాకట, తెలంగాణ తరహాలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయడానికి తాజాగా తేదీని ప్రకటించారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్కీమ్ అమలుకు ఆగస్టు 15 నుంచి శ్రీకారం చుట్టనుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కర్ణాటకలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేయగా.. తెలంగాణలో మాత్రం జీరో టికెట్ల విధానం అనుసరిస్తున్నారు. అలాగే గుర్తింపు కార్డులు చూసి జీరో టికెట్లు ఇస్తున్నారు. ఈ టికెట్ల ఆధారంగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లింపులు జరుపుతోంది. ఉచిత బస్సు ప్రయాణం వెంటనే అమలు చేయాలని ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్‌చార్జ్ వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.