- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Head Master in AP: పిల్లలు మాట వినడం లేదని.. మాస్టారు గుంజీళ్లు.. మీ స్వీయ క్రమశిక్షణకు అభినందనలు అంటూ మంత్రి లోకేశ్ ట్వీట్

దిశ డైనమిక్ బ్యూరో: పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని స్కూల్ హెడ్మాస్టర్ గుంజీళ్లు తీసిన ఘటన విజయనగరం (Vijayanagaram) జిల్లాలో జరిగింది. పిల్లలు చదువులో వెనకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన బొబ్బిలి మండలం, పెంట జడ్పీ హైస్కూల్ (ZP High School) ప్రధానోపాధ్యాయుడు రమణ.. వారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, గుంజీలు తీశారు, మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము, మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్అవడంతో మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందంచారు. పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని.. విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది అని ట్విట్టర్లో పేర్కొన్నారు. హెడ్మాస్టర్ గారూ! అంతా కలిసి పనిచేసి, ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ క్రమశిక్షణ చర్చ ఆలోచన బాగుంది, అభినందనలు. అందరం కలిసి విద్యా ప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం... అంటూ మంత్రి సూచించారు.