గుడివాడలో ప్రాబ్లమ్.. క్లియర్ చేసిన పవన్ కల్యాణ్

by srinivas |   ( Updated:2024-10-19 12:51:17.0  )
గుడివాడలో ప్రాబ్లమ్.. క్లియర్ చేసిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం తాగు నీటి సమస్యకు లైన్ క్లియర్ అయింది. కంకిపాడులో నిర్వహించిన ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో 43 గ్రామాల్లో తాగునీటి కలుషిత సమస్య ఉందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ప్రజలు తెలిపారు. దీంతో ఈ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపుతామని పవన్ హామీ ఇచ్చారు. కలుషిత నీరు బారిన పడిన గ్రామాల్లో నీటి పరీక్షలు చేయాలని రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. దీంతో అన్ని గ్రామాల్లో నీటి పరీక్షలు చేశారు. రక్షిత తాగునీరు సరఫరాలో లోపాలున్నట్లు అధికారులు గుర్తించారు. నందివాడ మండలంలో 12 పనులు గుర్తించి రూ.91 లక్షలు కేటాయించారు. తాగునీటిని శుద్ధి చేసే ఫిల్టర్ బెడ్ల నిర్మాణం, మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నివేదికను పనవ్ కల్యాణ్ కు అందజేశారు. దీంతో వెంటనే పనులు మొదలుపెట్టాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన గ్రామాల్లో సైతం తాగు నీటి ప్లాంట్ల మరమ్మతులుపై దృష్టి పెట్టాలని, వాటికి సంబంధించిన అంచనాలను సత్వరమే రూపొందించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

మొదటిగా సమస్య తీవ్రత అధికంగా ఉన్న నందివాడ మండలంలోని పోలసింగవరం, లక్ష్మీనరసింహపురం, జనార్థనపురం, జనార్థనపురం (హెచ్ డబ్ల్యూ), కుదరవల్లి, పెదవిరివాడ, పొనుకుమాడు, వెన్నెనపూడి, రామాపురం, కుదరవల్లి, ఐలపర్రు, నందివాడ గ్రామాల్లో ఫిల్డర్ బెడ్లు, సరఫరాలో లోపం లేకుండా అవసరమైన పనులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ నిధులు మంజూరు చేశారు.

Advertisement

Next Story

Most Viewed