మీడియాపై ప్రభుత్వ దమన కాండను అడ్డుకోవాలి..

by Jakkula Mamatha |   ( Updated:2024-02-21 15:08:21.0  )
మీడియాపై ప్రభుత్వ దమన కాండను అడ్డుకోవాలి..
X

దిశ, కడప: వ్యూహాత్మకంగా ఒక్కో వర్గాన్ని టార్గెట్‌ చేసి భయాందోళనలకు గురి చేస్తున్న జగన్‌ ప్రభుత్వం మీడియా నైతికస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా మీడియా ప్రతినిధులపై భౌతిక దాడులకు తెగబడుతోందని ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య ఆరోపించారు.రాప్తాడు సభలో ముఖ్యమంత్రి సమక్షంలోనే కొందరు వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గూండాలు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై విచక్షణా రహితంగా దాడి చేసిన సంఘటన జరిగి 24 గంటలు కాకముందే కర్నూలు ‘ఈనాడు’ కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు బరితెగించి దాడి చేయడం రాష్ట్రంలో అధికార పార్టీ నేతల అరాచకత్వానికి, దిగజారిన శాంతి భద్రతలకు నిదర్శనమన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

రాప్తాడులో జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కనీసం విచారం వెలిబుచ్చి,ఇటువంటి సంఘటనలు పునరావృతం కానీయమని చెప్పి ఉంటే కర్నూలు ఘటన జరిగేది కాదని అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల కనీస నమ్మకం లేని జగన్‌ రెడ్డి తన ప్రతి బహిరంగ సమావేశంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పై విషం కక్కుతూ తన పార్టీ నేతలకు ప్రత్యక్ష సంకేతాలు పంపి వారితో మీడియాపై దాడి చేయిస్తున్నారు. అధికారంలో ఉన్న వ్యక్తి ఈ రకంగా తన పాలనలో తప్పులను ఎత్తి చూపుతున్న మీడియాను టార్గెట్‌ చేసి అత్యంత హేయంగా దాడులు చేయించిన ఉదంతాలు గతంలో ఎన్నడూ లేవని, ఈ నీచ సంస్కృతిని ఇప్పుడే చూస్తున్నామని అన్నారు.

Read More..

అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి

Advertisement

Next Story