Ap Govt: పోలవరం పనులపై వేగం పెంచిన ప్రభుత్వం .. పాలనానుమతులు సవరిస్తూ ఉత్తర్వులు

by srinivas |   ( Updated:2024-10-30 16:45:10.0  )
Ap Govt: పోలవరం పనులపై వేగం పెంచిన ప్రభుత్వం .. పాలనానుమతులు సవరిస్తూ ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)ను త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గడిచిన కాలం, పెరిగిన అంచనా వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా నిధులకు సంబంధించి కొన్ని సవరణలు చేసింది. పోలవరం హెడ్‌ క్వార్టర్స్‌లో అంచనాలకు పాలనానుమతిని సవరించింది. ప్రాజెక్టులోని హెడ్‌ వర్క్స్‌ కోసం రూ.11,214.78 కోట్లకు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలవరం ప్రాజెక్టు పనులు మరింతగా ఊపందుకోనున్నాయి.

2014 టీడీపీ ప్రభుత్వం(TDP Govt) సమయంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే సమయం వరకూ ప్రాజెక్టులో దాదాపు 70 శాతం పనులు పూర్తి అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ (Ys Jagan) ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం చేసిందనే ఆరోపలు వినిపించాయి. కొంత మేర పనులు కొనసాగించామని జగన్ ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఓటమి పాలైంది. చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో పోలవరం ప్రాజెక్టు పూర్తిపై దృష్టి సారించారు. ఈ మేరకు పనులను ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా పోలవరం అంచనాలకు సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముందుకు వెళ్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed