- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌పై సన్నాహాలు.. ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వం జూన్ వరకే బడ్జెట్ పెట్టింది. దీంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలం ముగియనుంది. దీంతో పూర్తి స్థాయి బడ్జెట్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది.
సెప్టెంబర్ నెలలో బడ్జెట్ పెట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. సోమవారం ప్రారంభమైన ఈ సమావేశాలు ఆగస్టు 22 వరకూ జరగనున్నాయి. బడ్జెట్ అంచనాలపై ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యూలర్ జారీ అయ్యాయి. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు అంచనాలు రెడీ చేయాలని ఆయా అధికారులకు ఆర్థిక శాఖ సూచించింది. ఆగస్టు 2 నుంచి అన్ని అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశాల అనంతరం పూర్తి స్థాయి బడ్జెట్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.