పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఆగస్ట్ నెల పెన్షన్ నిధులు విడుదల చేసిన సర్కార్

by Satheesh |   ( Updated:2024-07-30 15:08:42.0  )
పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఆగస్ట్ నెల పెన్షన్ నిధులు విడుదల చేసిన సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్ట్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ నిధులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మంగళవారం మొత్తం రూ.2,737.41 కోట్లు రిలీజ్ చేసిన సర్కార్.. ఆగస్ట్ 1వ తేదీ నుండే పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్ట్ 1వ తేదీ ఉదయం 6 గంటల నుండే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ స్టార్ట్ చేయాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. 1వ తేదీనే దాదాపు 96 శాతం డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని, ఒకటో తారీఖు అందుబాటులో లేని వారికి 2వ తేదీన ఇవ్వాలని సూచించారు. కాగా, పెన్షన్ల పంపిణీ ప్రక్రియ నుండి వాలంటీర్లను పక్కన పెట్టిన బాబు సర్కార్.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఆసరా పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లు అందించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed