- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: అచ్యుతాపురం ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 18 మంది మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. 50 మందికిపైగా గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరికి అనకాపల్లి, విశాఖ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రియాక్టర్ పేలుడు ధాటికి ఫార్మా కంపెనీలోని మొదటి అంతస్తు స్లాబ్ కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ స్లాబ్ కింద పలువురు కార్మికులు ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతోంది.
మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్త చేశారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. క్షతగ్రాతులను మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సీఎం ఆదేశించారు. బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు గురువారం అచ్యుతాపురం వెళ్లనున్నారు. ప్రమాదంపై విషయం తెలుసుకున్న వెంటనే కలెక్టర్‌కు చంద్ రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.