GOOD NEWS: మహిళలకు మరో శుభవార్త అందించిన ప్రభుత్వం

by Anjali |   ( Updated:2024-07-16 07:48:33.0  )
GOOD NEWS: మహిళలకు మరో శుభవార్త అందించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు శుభవార్త అందించారు. ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఫోకప్ పెడుతోంది. ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తుండగా.. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఉన్నతి పథకం కింద డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాల పరిమితి 2 లక్షల రూపాయల నుంచి రూ. 5 లక్షల వరకు పెంచుతున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఈ రుణాల పరిమితి రెండు లక్షల వరకే ఉండేది. మహిళల జీవనోపాధి కింద ఒక్కొక్కరికి 50 వేల రూపాయల వరకు రుణం ఇవ్వనుందని సర్కారు తెలిపింది. ఈ రుణాలను మహిళలు వాయిదా రూపంలో చెల్లించాలి. 2024- 25 ఏడాదికి సంబంధించి 250 కోట్ల రూపాయలు రుణాలుగా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సంబంధిత ఫైల్‌పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు.

Advertisement

Next Story