- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసేపట్లో ఫోర్త్ లిస్ట్.. హుటాహుటిన సీఎంవోకు ఆ ఎమ్మెల్యేలు
దిశ, వెబ్ డెస్క్: మరికాసేపట్లో వైసీపీ నాలుగో జాబితా విడుదల కానుంది. పలు నియోజకవర్గాలకు వైసీపీ ఇంచార్జులను సీఎం జగన్ మార్చుతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సిట్టింగులకు కాదని కొత్త ఇంచార్జిలను నియమించారు. ఇలా మూడు జాబితాలను విడుదల చేశారు. ఇప్పుడు నాలుగో లిస్టు కూడా విడుదల చేసేందుకు సిద్ధిమయ్యారు. ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలించిన సీఎం జగన్ ఫైనల్‌గా కొందరి పేర్లతో లిస్టు రెడీ చేశారు. దీంతో మరికొందరిలో టెన్షన్ ప్రారంభమైంది. లిస్టులో తమ పేరు ఉందోలేదోననే సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే సీఎంవో అధికారులను ఫోన్ చేసి అడిగారు. అయితే అక్కడి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది.
దీంతో డైరెక్ట్‌గా సీఎం కార్యాలయంలోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల నుంచి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి బయల్దేరారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నారు. మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం క్యాంపు కార్యాలయానికి బయల్దేరారట. ఒంగోలు ఎంపీ విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనావాసరెడ్డి తన అభిప్రాయాన్ని చెప్పారు. అయినా సస్పెన్స్ కొనసాగుతోంది. నాలుగో లిస్టులోనైనా ఒంగోలు ఎంపీ పంచాయితీ తెగుతుందేమోనని బాలినేని ఆశిస్తున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.