వైసీపీపై పోరాటం ఇంతటితో ఆగేది కాదు: బాలకృష్ణ

by Seetharam |   ( Updated:2023-09-21 06:15:50.0  )
వైసీపీపై పోరాటం ఇంతటితో ఆగేది కాదు: బాలకృష్ణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల విషయంలో పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని తెలుసుకుని వైసీపీ అక్రమ కేసులు పెట్టి టీడీపీని బలహీన పరిచే కుట్రలు చేస్తోందని అన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు హాజరైన బాలకృష్ణ వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకు భయపడేది లేదని నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు.

Read More..

అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ.. అంబటి స్ట్రాంగ్ కౌంటర్!

Advertisement

Next Story