ఆ విషయంలో అధికారాలకు ఎన్నికల కమిషన్ అల్టిమేట్

by Indraja |
ఆ విషయంలో అధికారాలకు ఎన్నికల కమిషన్ అల్టిమేట్
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడు కూసే సమయం ఆసన్నమైన నేపథ్యంలో అధికారులకు ఎన్నికల నిర్వాహణ గురించి సలహాలు సూచనలు ఇస్తూ ఎన్నికల యుద్దానికి సిద్ధం చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మరో రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

దీనితో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎన్నికల ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖేష్ కుమార్ మీనా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

రానున్న ఎన్నికల్లో జీరో వయెలెన్సు, నో రీపోల్ ప్రధానంగా ఎన్నికలు జరగాలని.. దానికి అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెట్లు, పోలీస్ కమిషనర్లు ప్రణాళికా బద్దంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించాలని.. ఎలాంటి హింసాత్మక చర్యలకు తావు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.

ఈ విషయంలో ఏదైనా తేడా వస్తే.. భారత ఎన్నికల సంఘం ఉపేక్షింబోదనే విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకోవాలని అల్టిమేట్ జారీ చేశారు. ఇక అలానే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. బూత్ క్యాప్చరింగ్‎కు ఎటు వంటి అవకాశం లేకుండా పటిష్టమై బందోబస్తు ఏర్పాట్లను కూడా చేసుకోవాలని తెలిపారు. ఇక ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీ పక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక పాడేరుప్రాంతానికి తప్ప ఓటర్ల గుర్తింపు కార్డులను తప్పనిసరిగా పోస్టల్ ద్వారానే పంపిణీ చెయ్యాలని ఆదేశించారు.


Advertisement

Next Story

Most Viewed