- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతిగా నీళ్లు తాగడం ఆరోగ్యానికి చేటు!
దిశ, ఫీచర్స్: శరీరం మొత్తంలో సగానికి పైగా నీటితో నిండి ఉంటుంది. అలసటగా అనిపించినా లేదా చర్మం పోడిబారినట్లు అనిపించినా నీళ్లు ఎక్కువగా తాగాలని చెబుతుంటారు. ఎక్కువ నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. మెరుగైన ఆరోగ్యం, ఎనర్జీ, చర్మం మెరిసేందుకు నీరు ఉపయోగపడుతుంది. అయితే, రోజు మొత్తంలో రెండు లీటర్ల నీరు తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెద్దవారు అయితే రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు తాగడం మంచిది. కానీ, నీళ్లు ఎక్కువగా తాగడం మంచిదే అయినా.. అతిగా నీళ్లు తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు.
ఎలాంటి సమస్యలు:
శరీరానికి కావాల్సినంత నీరు కంటే ఎక్కువగా ఇస్తే, మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. వైద్య పరిభాషలో దీనిని వాటర్ ఇన్ టాక్సికేషన్ అంటారు. ఎండలో తిరిగిన్పపుడు, ఆటలు ఆడే సమయంలో చెమట ఎక్కువగా పడుతుంది. దీని వల్ల శరీరంలో నీటి స్థాయిలు తగ్గకుండా ఎక్కువగా నీరు తాగుతుంటారు. ఇలా ఎక్కువగా నీరు తాగడం వల్ల వాటర్ ఇన్ టాక్సికేషన్‌కు కారణం అవుతుంది. అయితే, శరీరంలో ఏర్పడే కొన్ని లక్షణాలు బాడీలోని నీటి స్థాయి పెరుగుతుందని సూచిస్తుంది. మితిమీరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో మినరల్స్ ఎక్కువై, సోడియం స్థాయిలు పండిపోతాయి. సోడియం స్థాయిలు పడిపోతే శరీరంలోని కణాల పనితీరు నెమ్మదిస్తుంది. దీని వల్ల తలనొప్పి, వాంతులు, చిరాకు వంటి సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ అతిగా నీరు తాగితే, అది మెదడుపై ప్రభావం చూపుతుంది. దీంతో పాటు బీపీ పెరగడం, కండరాలు నీరసించిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అందువల్ల శరీరానికి అవసరమైన నీటిని తాగడమే ఉత్తమం.
ఎన్ని నీళ్లు తాగాలి?
కొంతమంది రోజుకు రెండు లీటర్లు తాగాలంటే.. ఒకేసారి రెండు టీటర్ల నీటిని తాగేస్తారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఒకేసారి కాకుండా శరీరానికి తగినట్లుగా అప్పుడప్పుడు నీటిని తీసుకోవాలి. సంవత్సరంలోపు చిన్నారులకు తల్లిపాలతో పాటుగా 4 కప్పుల నీరు సరిపోతుంది. 4 లేదా 8 ఏళ్ల పిల్లలకు రోజులో 1 లీటరు నీటిని ఇవ్వడం మంచిది. ఇది మాత్రమే కాదు శరీరంలో తేమ స్థాయిని సమతుల్యం చేయాలంటే కేవలం నీళ్లు మాత్రమే కాదు పండ్ల రసాలు కూడా తీసుకోవడం మంచిది. దీని వల్ల వాటన్ ఇన్ టాక్సికేషన్ తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.