- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఫైనల్ “కీ” విడుదల
![టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఫైనల్ “కీ” విడుదల టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఫైనల్ “కీ” విడుదల](https://www.dishadaily.com/h-upload/2024/10/29/385859-tet-final-key.webp)
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సెప్టెంబర్ 3 నుంచి 21 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(Teacher Eligibility Tests) నిర్వహించారు. కాగా ఈ పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీ ను ఈ రోజు విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఫైనల్ కీ ని csc.ap.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఈ నెల మూడు నుంచి దాదాపు 18 రోజుల పాటు జరిగిన ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)కు మొత్తం 4, 27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 3,68,661 మంది పరీక్షలు రాశారు. నవంబర్ 2న ఫలితాలను విద్యాశాఖ(Education Department) షెడ్యూల్ ప్రకారం ప్రకటించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర నిరుద్యోగులకు మెగా డీఎస్సీ హామీ ఇచ్చింది. ఈ మేరకు అధికారంలో రాగానే కేబినెట్ ఆమోదం తెలిపి డీఎస్సీ తో పాటు ఈ టెట్(TET) పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ నెలలో టెట్ పరీక్షలు పూర్తవ్వగా.. నవంబర్ మొదటివారంలో మెగా డీఎస్సీ-2024 (Mega DSC) నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల( Teacher Posts) భర్తీ చేయనున్నారు