విజయవాడలో భారీ వర్షం.. ఇంద్రకీలాద్రిలో దసరా పనులకు ఆటంకం

by srinivas |
విజయవాడలో భారీ వర్షం.. ఇంద్రకీలాద్రిలో దసరా పనులకు ఆటంకం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో భారీ వర్షం (Heavy Rain) కురిసింది. ఈ ఉదయం 10 నుంచే ఉక్కపోతతో నగర వాసులు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం అయ్యే సరికి ఒక్కసారిగా వాతావరణం మారింది. నల్లని మబ్బులతో చల్ల గాలితో చినుకులు ప్రారంభమమయ్యాయి. కొద్దిసేపటికే కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అటు దుర్గమ్మ టెంపుల్ ఇంద్రకీలాద్రి(Indrakiladri) మొత్తం తడిచిపోయింది. వర్షం కారణంగా దసరా ఉత్సవాలకు సంబంధించిన పనుల్లో అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు నగరంలో పలుచోట్ల నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగిస్తున్నారు.

కాగా విజయవాడను ఇటీవల వరదలు ముంచిత్తిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారీగా వర్షం పడుతుండటంతో వీఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. స్థానిక వాగులు, వంకలు, చెరువులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటు కొండ ప్రాంత ప్రజలకు అలర్ట్ ప్రకటించారు. వర్షాలు మరింత పెరిగితే కొండచరియలు విరిగి పడే అవకాశం ఉందని, పరిస్థితి బట్టి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక ప్రజలకు సూచించారు.

Next Story