ఏపీలో కొత్త మద్యం పాలసీ.. నాలుగు కమిటీలతో 6 రాష్ట్రాల్లో అధ్యయనం

by srinivas |
ఏపీలో కొత్త మద్యం పాలసీ.. నాలుగు కమిటీలతో 6 రాష్ట్రాల్లో అధ్యయనం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ పాలసీ పూర్తి రూపకల్పనపై వేగంగా అడుగులు వేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న మద్యం పాలసీలను అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులతో కూడిన నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో అధికారులు సభ్యులుగా పని చేయనున్నారు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళలో పర్యటించి అక్కడ కొనసాగుతున్న మద్యం పాలసీలను అధ్యయనం చేయనున్నారు. పూర్తి పరిశీలన అనంతరం నివేదిక రూపొందించనున్నారు. ఈ నెల 12న ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.

కాగా గత ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చింది. ఇష్టమొచ్చిన బ్రాండ్లను విక్రయించింది. పాత మద్యం బ్రాండ్లను నిలిపివేశారు. డిజిటల్ చెల్లింపులు చేయలేదు. దీంతో జగన్ తీసుకొచ్చిన మద్యం పాలసీ విధానంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుత్తాయి. అటు ప్రతిపక్ష నాయకులు సైతం చాలా నిరసనలు వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే కొత్త మద్యం పాలసీని తీసుకొస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. ప్రస్తుతం సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పాలన సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే 2014-19 నాటి పాత బ్రాండ్లనే మళ్లీ తీసుకొచ్చింది. మద్యం విధానంలో కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పాలసీ రూపకల్పనకు 4 కమిటీలను ఏర్పాటు చేసింది.

Advertisement

Next Story