- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పేరిట అతిపెద్ద కుంభకోణం..?
దిశ ప్రతినిధి,విశాఖపట్నం:గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖపట్నంలో చేసిన అతి పెద్ద కుంభకోణాల్లో వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఒకటి. రానున్న 20 సంవత్సరాలకు సరిపడా రూపొందించాల్సిన ఈ మాస్టర్ ప్లాన్‌ను పూర్తిగా వైసీపీ నేతల ఆస్తులు కూడగట్టుకునే ప్లాన్‌గా తయారు చేశారు. తమకు భూములు ఇవ్వడానికి అంగీకరించిన వారు, డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన వారి దగ్గర ఒక రకంగా ప్లాన్ రోడ్డులను మార్చి, నిరాకరించిన వారిని ఇబ్బందులకు గురి చేశారు. దీనిపై తీవ్ర ఆరోపణలు వ్యక్తం కావటం, కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లటంతో మాస్టర్ ప్లాన్ విషయంలో కొంత పునరాలోచన చేస్తున్నారు.
మాజీ ఎంపీ ఎంవీవీకి టీడీఆర్ ఇచ్చేందుకు 45 మీటర్లలో సిరిపురం రోడ్డు సిరిపురం జంక్షన్ నుంచి సంపత్ వినాయక గుడి మీదుగా రైల్వే స్టేషన్ వరకు ఉన్న రోడ్డును 45 మీటర్లకు ప్రతిపాదించారు. సిరిపురం జంక్షన్లో సీబీసీఎన్‌సీ భూముల్లో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయం కోసమే ఈ ప్రతిపాదన చేశారు. సీబీసీఎస్‌సీ భూములు ముందు మాత్రమే 45 మీటర్లకు అనుగుణంగా రోడ్ వెడల్పు చేస్తారు. దీనికి 62 కోట్ల టీడీఆర్ తీసుకున్నారు. అంతే తప్ప సిరిపురం నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డుకు ఇరువైపుల విస్తరణ చేపట్టడం సాధ్యం కాదు. గతంలో ఈ రోడ్డుకి రెండువైపులా శ్రీకాంత్ జీవీఎంసీ కమిషనర్‌గా ఉండగా డక్ట్‌లు నిర్మించారు. ఇప్పుడు వాటిని తొలగించడం అసాధ్యం. ఎందుకంటే ఖరీదైన వాణజ్య భవనాలు తొలగించాలంటే వందల కోట్ల పరిహారం ఇవ్వాలి. అది సాధ్యం కాదు. కేవలం సీబీసీన్‌సీ భూముల ముందు మాత్రమే రోడ్ విస్తరించి మిగిలిన రోడ్ పోడవునా విస్తరించకుండా కేవలం మాస్టర్ ప్లాన్‌లో మాత్రం 45 మీటర్లుగా చూపించాలని కుట్ర పన్నారు. ప్రస్తుతం ఇక్కడ 100 అడుగుల రోడ్డు ఉంది. దీనినే కొనసాగించి అవసరమైతే ఫుట్ పాత్ తొలగిస్తే సరిపోతుంది.
దసపల్లా టీడీఆర్ కోసం 100 అడుగుల రోడ్డు
సర్క్యూట్స్ జంక్షన్ నుంచి నేవీ హౌస్ ముందుగా గుండా దసపల్లా భూములు మీదుగా పందిమెట్ట రోడ్డుకు ప్రస్తుతం 40 అడుగుల రోడ్డు ఉంది. ఇక్కడ పెద్దగా ట్రాఫిక్ లేనందున ప్రస్తుతం ఉన్న 40 అడుగుల రోడ్డు సరిపోతుంది. కానీ విజయసాయిరెడ్డి కుమార్తెకు చెందిన కంపెనీ దసపల్లా భూములలో నిర్మాణాలు చేపట్టేందుకు భూ యజమానులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 100 అడుగుల రోడ్ ఉంటే 20 అంతస్తులకు మించి నిర్మించవచ్చు. అయితే రోడ్డు విస్తరణకు భూమి ఇస్తున్నామని 300 కోట్ల టీడీఆర్ కొట్టేయాలన్నది కుట్ర. రోడ్ విస్తరణలో దసపల్లా భూముల వ్యవహారంలో కీలకంగా మారిన న్యాయవాది ఇళ్లు పోకుండా తప్పించారు. అదే పందిమెట్ట రోడ్డుకు ఆనుకొని ఆరేడు భవనాలు పోతున్నాయని తెలుసుకున్న భవన యజమానులు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఉన్న 40 అడుగుల రోడ్డును కొనసాగిస్తే డెవలప్మెంట్ అగ్రిమెంట్ రద్దవుతుంది. జీవీఎంసీకి రూ.300 కోట్ల టీడీఆర్ మిగులుతుంది.
సన్ రే రిసార్ట్స్ అనుకూలంగా ప్లాన్..
భోగాపురం వద్ద సన్ రే రిసార్ట్‌కు పడమరవైపుగా ప్లాన్ మార్చేశారు. వాస్తవంగా అయితే రిసార్ట్ మధ్య నుంచి వెళ్ళాలి. ఇక్కడ వైసీపీ నేతలకు భూములు ఉన్నాయి. తర్వాత భోగాపురం ఎయిర్ పోర్టుకు ముందుగానే రోడ్డును తిప్పి జాతీయ రహదారికి కలపాలి. కానీ ఎయిర్ పోర్టుకు ఉత్తరం వైపుగా రోడ్ తీసుకెళ్లి జాతీయ రహదారికి కలిపారు. ఇక్కడ సండే రిసార్ట్ విలేజ్ ఉంది. దీనికి మేలు చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. దీనివల్ల ఎందరో సామాన్య, మధ్యతరగతి కుటుంబీకులు అక్కడ ప్రైవేటు లే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లు పోతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రాఫిక్, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. దీనిపై మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. సిరిపురం జంక్షన్‌లో సీబీసీఎస్సీ భూముల వద్ద ఇచ్చిన టీడీఆర్లు రద్దుచేయాలి.
వారి భూములకు విలువ పెరగాలని..
రుషికొండ నుంచి భీమిలి ఎస్‌వోఎస్ విలేజ్ వరకు 60మీటర్లు, అక్కడ నుంచి గోస్తని నది మీదుగా తీరం వెంబడి భోగాపురం ఎయిర్ పోర్టుకు ఆనుకుని రోడ్డు 70 మీటర్లకు ప్రతిపాదించారు. అయితే భీమిలి ఎస్‌ఓఎస్ విలేజ్ నుంచి ఎడమవైపునకు రోడ్ ప్రతిపాదించి మూలకుద్దు మీదుగా భోగాపురం వరకు ప్లాన్ మార్చారు. విజయసాయిరెడ్డి కుమార్తె. వైసీపీ నేతలకు కువ స్మరిపాలెం, నేరెల్లవలస, మూలకుద్దు వద్ద భూములున్నాయి. వీరి భూములకు విలువ పెరగాలని మాస్టర్ ప్లాన్‌లను మార్చేశారు. పోర్టు నుంచి కైలాసగిరి వరకు రోడ్ కూడా 150 అడుగుల ప్రతిపాదించారు. దీనిప్రకారం కురుపాంటూంబ్ ఎదురుగా భారీ అపార్టుమెంటు పోర్టు వరకు మాస్టర్ ప్లాన్ రోడ్ వెళుతుంది.
కానీ వైసీపీ నేతలకు ముడుపులు అందడంతో మాస్టర్ ప్లాన్ లో డిజైన్ పడమర వైపుకు అంటే కురుపాం టూంబ్ మీదుగా మార్చేశారు. నిబంధనల మేరకు రోడ్ సెంటర్ పాయింట్ నుంచి ఇరువైపులా సమానంగా విస్తరించాలి. కైలాసగిరి నుంచి భీమిలి ముందు ఎస్‌వోఎస్ విలేజ్ వరకు 60 మీటర్లకు ప్రతిపాదించారు. సాగర్ నగర్ నుంచి రుషికొండకు వెళ్లే దారిలో రాడిసిన్ బ్లూ హోటల్‌కు ఇబ్బంది లేకుండా మొత్తం రోడ్డును పడమర వైపునకు జరిపారు. దీని వల్ల ఆదిభట్ల నగర్ లేఅవుట్లో సగం పోతుంది. రాడిసన్ హోటల్ అరవిందో గ్రూప్ నకు చెందింది. కాబట్టి మార్చేశారు. రోడ్ విస్తరించేటప్పుడు మధ్య నుంచి ఇరువైపులా సమానంగా తీసుకోవాలి. అందువల్ల రాడిసన్ బ్లూ హోటల్ వైపుగా కొంత భాగం తీసుకోవాలి.