మంత్రులకు సలహాదారులు ఓకే.. శాఖలకు సలహాదారులేంటి?

by Hajipasha |   ( Updated:2022-08-24 11:26:55.0  )
మంత్రులకు సలహాదారులు ఓకే.. శాఖలకు సలహాదారులేంటి?
X

దిశ, ఏపీ బ్యూరో: దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారుగా జె.శ్రీకాంత్ నియామకంపై హైకోర్టు స్టే విధించింది. శ్రీకాంత్ నియామకాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మణ సేవా సంఘం హైకోర్టును ఆశ్రయించింది. శ్రీకాంత్ నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజుల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ నియామక జీవోను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలానే వదిలేస్తే రేపు అడ్వకేట్ జనరల్‌ను సలహాదారుని నియమిస్తారు అంటూ వ్యాఖ్యానించింది. సలహాదారులను నియమించేందుకు అధికారుల కొరత ఉందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడింది. మంత్రులకు సలహాదారులు ఉంటే అర్థం ఉంది.. కానీ శాఖలకి సలహాదారు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా జే శ్రీకాంత్ నియామకానికి సంబంధించిన జీవోను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed