కూటమి సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం

by Mahesh |
కూటమి సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం
X

దిశ, వెబ్ డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత భారీ విజయం సాధించిన బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఆ ప్రాంత నేతలతో టీడీపీ, జనసేన నేతలు చర్చలు చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు నామినేషన్ ప్రక్రియకు చివరి రోజు కావడంతో.. మరోసారి విశాఖ నేతలతో చర్చించిన చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని సూచించారు. దీంతో కూటమి నేతలు సీఎం చంద్రబాబు నిర్ణయానికి ఆమోదం తెలిపి.. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. కాగా ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే నామినేషన్ వేయగా.. కూటమి నిర్ణయంతో ఆయనకు లైన్ క్లియర్ అయింది.

Advertisement

Next Story