Breaking: అది ఆవేదన కాదు ప్రేమ.. బుద్ధా వెంకన్న

by Indraja |   ( Updated:2024-02-26 09:22:31.0  )
Breaking: అది ఆవేదన కాదు ప్రేమ.. బుద్ధా వెంకన్న
X

దిశ డైనమిక్ బ్యూరో: టీడీపీ జనసేన పొత్తు లో భాగంగా 118 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ మొదటి జాబితాను విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే అభ్యర్థుల జాబితాను విడుదల చెయ్యడం అటు టీడీపీకి ఇటు జనసేనకు తలనొప్పిగా మారింది. టికెట్ దక్కని టీడీపీ నేతలు, జనసైనికులు నిరసనలు చేపడుతూ ఇరు పార్టీల పరువును గంగలో కలిపేస్తున్నారు. ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి అతి సన్నిహితుడైన బుద్ధా వెంకన్నకి కూడా పార్టీ టికెట్ దక్కలేదు.

దీనితో ఆయన ఓ సమావేశాన్ని నిరవహించారు. ఈ నేపథ్యంలో మీరు మీ రక్తంతో చంద్రబాబు కళ్ళు కడిగారు, బలప్రదర్శన నిర్వహించారు.. తన ఆవేదన చంద్రబాబుకు చెప్పే ప్రయత్నం చేసారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోందని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నపై బుద్దా వెంకన్న స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తమకు ఇన్నాళ్లు భగవంతుడని.. ఈ రోజు తనకి సీటు ఇవ్వలేదని చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిత్వం తనది కాదని పేర్కొన్నారు.

తాము బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులమని.. ఒక్కపూట భోజనం పెడితేనే వాళ్లకి అంకితభావంతో ఉంటామని తెలిపారు. ఇక టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా తాము జీవితాంతం చంద్రబాబు నాయుడికి అంకిత భావంతో ఉంటామని తెలిపే ఉద్దేశంతోనే నిర్వహించిన సమావేశం అని స్పష్టం చేశారు. ఇక తాను రక్తంతో చంద్రబాబు కళ్ళు కడిగినా, బలప్రదర్శన చేసినా అది తనకు చంద్రబాబు పై ఉన్న ప్రేమని.. అది ఆవేదన కాదని తెలిపారు.

ఆవేదన అంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారని.. తనకి చంద్రబాబు అంటే ప్రేమని.. ఆవేదన వేరు ప్రేమ వేరని స్పష్టం చేశారు. ఇక రక్తంతో చంద్రబాబు కాళ్ళు కడగడం అనేది దేశంలో ఓ చరిత్ర అని.. అయితే దాని గురించి పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు పాజిటివ్ గా నెగటివ్ గా ఆలోచించే వాళ్ళు నెగటివ్ తీసుకుంటారని తెలిపారు.

Advertisement

Next Story