TG Venkatesh: ఏపీలో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-05-12 14:45:37.0  )
TG Venkatesh: ఏపీలో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడాదిలోపు ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఏపీలో పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ జనసేన పార్టీలు మాత్రమే పొత్తులో ఉన్నాయి. అయితే టీడీపీతో కూడా పొత్తుపెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచిస్తుంటే అందుకు బీజేపీ నాయకత్వం ఒప్పుకోవడం లేదు. మరోవైపు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు.

పొత్తులపై బీజేపీ నేత టీజీ వెంకటేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇలాంటి సమయంలో బీజేపీ నేత టీజీ వెంకటేశ్ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలకు మూడు నెలల ముందు పొత్తులు ఖరారవుతాయని స్పష్టం చేశారు. పరిస్థితులకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని..వైసీపీ సర్కారును అధికార పీఠం నుంచి కిందికి దించడమే బీజేపీ అజెండా అని టీజీ వెంకటేశ్ తెలిపారు. అదే సమయంలో తమ పొత్తు ప్రస్తుతానికి జనసేనతో ఉందని చెప్పారు. పవన్ కల్యాణ్ తమతోనే ఉంటారని..వచ్చే ఎన్నికల్లోనూ కలిసే పని చేస్తామని టీజీ వెంకటేశ్ తెలిపారు.

ఆ పార్టీకి మాత్రం కాదు: టీజీ

ఏపీలో బీజేపీ, వైసీపీ ఒక్కటేనంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీజీ వెంకటేశ్ ఖండించారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉంటాయనేది వాస్తవమన్నారు. కేంద్రంలోని బీజేపీ మద్దతు ఇచ్చింది ఏపీ ప్రభుత్వానికి మాత్రమేనని..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం కాదని టీజీ వెంకటేశ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Nadendla Manohar: పవన్ ఆశయాలకు వారే వారధులు

Advertisement

Next Story