- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరులో ఉద్రిక్తత: సోమిరెడ్డి దీక్ష భగ్నం చేసిన పోలీసులు
దిశ, డైనమిక్ బ్యూరో : అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పొదలకూరు మండలం తాటిపర్తి వరదాపురం వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్ష శిబిరంలో సోమవారం అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తతల నడుమ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీక్షా శిబిరం నుంచి ఎత్తుకెళ్లిన పోలీసులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని అల్లిపురం వద్ద ఉన్న నివాసంలో వదిలిపెట్టి వెళ్లారు. ఇకపోతే పొదలకూరు మండలంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ తవ్వుతున్నారంటూ మూడు రోజుల నుంచి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. అయితే పోలీసులు సోమవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో దీక్షను భగ్నం చేశారు. ఈ సమయంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ శ్రేణులు పోలీసులకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు రాత్రి 2 గంటల సమయంలో దీక్షను భగ్నం చేశారు. కాగా పొదలకూరు మండలంలోని తాటిపర్తి సమీపంలో మూడు రోజులక్రితం సత్యాగ్రహ దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే.