- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కడప మేయర్ ఇంటి ముందు హెటెన్షన్.. చెత్త వేసి టీడీపీ నేతల నిరసన
దిశ, వెబ్ డెస్క్: కడపలో చెత్త వివాదం ముదిరింది. మేయర్ సురేశ్ బాబు ఇంటి వద్ద చెత్త వేయాలని ఎమ్మెల్యే మాధవీరెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో హెటెన్షన్ నెలకొంది. మేయర్ సురేశ్ బాబు ఇంటి ముందు భారీగా చెత్త వేసి టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ వీధుల్లో ఉన్న చెత్తను వెంటనే తీసివేయించాలని డిమాండ్ చేశారు. ఇందుకు కౌంటర్‌గా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఇంటి వద్ద నిరసన చేసేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపు చేశారు. కడప టౌన్‌లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి నిరసన చేసినా చర్యలు తప్పవని ఇరువర్గాలను హెచ్చరించారు.
కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో అమలవుతున్న చెత్త పన్నును రద్దు చేసింది. దీంతో ప్రజలు చెత్త పనులు కట్టడం మానేశారు. అయితే చెత్త పన్ను రద్దు చేసినట్లు తమకు అధికారికంగా ఆదేశాలు రాలేదని, ప్రజలు పన్ను కట్టకపోతే చెత్త సేకరించొద్దని పారిశుధ్య కార్మికులను మేయర్ సురేశ్ బాబు ఆదేశించారు. దీంతో చెత్త వివాదం తలెత్తింది. ప్రభుత్వ ఆదేశాలను మేయర్ సురేశ్ బాబు పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులు చెత్త సేకరించకపోతే మేయర్ సురేశ్ బాబు ఇంటి వద్ద వేయాలని ఆమె పిలుపు నిచ్చారు. దీంతో టీడీపీ శ్రేణులు ఈ రోజు సురేశ్ బాబు ఇంటి ముందు చెత్త వేసి నిరసన తెలపడంతో కడపలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.