Ap Elections: పోలింగ్ వేళ హింసాత్మకం.. ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు

by srinivas |
Ap Elections: పోలింగ్ వేళ హింసాత్మకం.. ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల పోలింగ్ వేళ పల్నాడులో జిల్లాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు ఘర్షణలకు దిగుతున్నారు. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. తలలు పగిలిపోతున్నాయి. అయినా ఆగడంలేదు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. పోలింగ్‌కు ముందు నుంచే ఘర్షణలకు దిగారు. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో గాయపడుతున్నారు. జిల్లాలోని దాచేపల్లి, అచ్చంపేట, గురజాలలో వైసీపీ, టీడీపీ శ్రేణులు కొట్టుకున్నారు. మహిళలు సైతం రోడ్డుపై దాడులు చేసున్నారు. ఈ దాడుల్లో చాలా మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొడుతున్నారు. పరిస్థితిని అదుపు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, గుంపులు, గుంపులుగా తిరగొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Next Story