- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఏపీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం..
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం కళ్లకుకట్టినట్లు కనిపిస్తోంది. ఓ వైపు పొత్తులు మరో వైపు ప్రచారాలు, నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలుతో ఏపీ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. నువ్వా.. నేనా అన్నట్లు పార్టీ అధినేతలు పోటాపోటీగా ప్రచారాల్లో మునిగి తేలుతున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర సీఎం వైఎస్ జగన్ "సిద్ధం" కాగా జనసేనాని పవన్ మేము సిద్దమే అంటుంటే.. "రా కదిలిరా అంటున్నారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.
ఇక నేను యువగలంతో ఆగిపోలేదంటూ శంఖారావం చేస్తూ సాగిపోతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అలానే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాక జోష్ పెంచి ఆంధ్రలో జరిగిన అభివృద్ధిని చూపించమని అటు అధికార పార్టీని ఇటు విపక్షాలను ఏకిపారేస్తున్న వైఎస్ షర్మిల కూడా జిల్లాల వారీగా పర్యటిస్తూ.. పార్టీని ప్రజల్లో బలోపితం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో షర్మిల చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పొల్గొననున్నారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తెలిపారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నారా చంద్రబాబుకు వీరాభిమాని అని అందరికి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కేవలం అధికార పార్టీని టార్గెట్ చేస్తారా..? లేక టీడీపీ పై కూడా విమర్శల బాణాలు సంధిస్తారా? అనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.