- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతుందని వైఎస్ జగన్ ప్రశ్న.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఉచిత ఇసుక విధానం పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతోందంటూ వైఎస్ జగన్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ వ్యాఖ్యలపై టీడీపీ స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ‘నువ్వు ఉండే బెంగళూరులో ఏమో కానీ.. ఏపీలో మాత్రం దొరుకుతోందని’ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇసుక, మద్యం గురించి నీవు ఎంత తక్కువ మాట్లాడితే నీకు అంత మంచిదని టీడీపీ హితవు పలికింది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి వందల మంది ఆత్మహత్యకు కారణమయ్యారని’ టీడీసీ విమర్శించింది. ఈ నేపథ్యంలో ‘నీ ఇసుక దోపిడీకి సంబంధించిన FIR నమోదైందని, విచారణ కూడా జరుగుతుందని టీడీపీ తెలిపింది. ఏ నిమిషమైనా తాడేపల్లి వరకు వస్తుందని చెప్పింది. పాలన, పాలసీల గురించి మాట్లాడే హక్కు నీకు లేదని వ్యాఖ్యానించింది. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలపై కూడా త్వరలోనే విచారణ ప్రారంభమవుతుందని’ టీడీపీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.