- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ వ్యూహం.. బొత్సను ఎదుర్కొనేందుకు పక్కా ప్లాన్
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి పార్టీలు అప్పుడే రాజకీయాలు ప్రారంభించాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాస్ ఇంట్లో శనివారం ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. అరకు, పాడేరు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలపై టీడీపీ ఫోకస్ పెట్టారు. సమావేశానికి ఏజెన్సీకి చెందిన 60 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీలు హాజరైనట్లుగా తెలిసింది. స్పీకర్ అయ్యన్నపాత్రులతో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారిని అమరావతిలో క్యాంపునకు తరలించి దాదాపు నెల రోజుల పాటు శిబిరంలోనే టీడీపీ ఉంచనుంది.
పీలా గోవింద్ పేరు ఖాయం..
ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. జనసేనకి అనకాపల్లి టికెట్ కేటాయించడంతో గోవింద్‌కి అవకాశం దక్కలేదు. ఆర్ధికంగా గోవింద్ సరైన అభ్యర్థి కావడంతో అవకాశం ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బొత్సను ఎలాగైనా.. ఓడించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న టీడీపీ నేతలు చాలా కష్టపడాల్సి ఉంది. స్పష్టమైన మెజారిటీ వైసీపీకి ఉండటంతో మరో రెండు వందల మంది ఓటర్లను ఆకట్టుకొని శిబిరానికి తరలించాల్సి ఉంది.