Minister Roja మళ్లీ జబర్దస్త్‌కు వెళ్తే బెటర్: Vangalapudi Anitha

by srinivas |   ( Updated:2022-11-26 14:42:39.0  )
Minister Roja మళ్లీ జబర్దస్త్‌కు వెళ్తే బెటర్: Vangalapudi Anitha
X

దిశ, డైనమిక్ బ్యూరో : మంత్రి రోజాకు తన నియోజకరవర్గంలో చీటి చిరిగిపోయిందని, అందుకే జగన్ మెప్పుకోసం ఉత్సవాల పేరుతో డ్యాన్సులేస్తోందనిరాష్ట్ర టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. పర్యాటక శాఖ ఉద్యోగులకు నెలనెలా జీతాలు లేక అల్లాడిపోతుంటే, ప్రజల సొమ్ముతో జగన్ రెడ్డి పుట్టినరోజు పేరుతో స్వర్ణోత్సవాలు చేస్తారా అని ఆమె మండిపడ్డారు. జగన్ మెప్పుకోసం మంత్రి రోజా పాకులాడుతోందరని ఎద్దేవా చేశారు. జగన్‌పై ఆమెకు చెప్పుకోలేనంత ప్రేమే ఉంటే, నగరి నియోజకవర్గంలో ఆయన పుట్టినరోజు నిర్వహించి ప్రజల మధ్యన స్టెప్పులేయాలని అనిత సూచించారు.

వైసీపీ మహిళా నేత పగురు నాగసాయి విజయవాడలో వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు అనిత. మాట్లాడితే రోడ్లపైకొచ్చి దిష్టిబొమ్మలు తగలెట్టి, ధర్నాలు చేసే వైసీపీ మహిళా నేతలు నాగసాయి దిష్టిబొమ్మ ఎందుకు తగలేయడంలేదని ప్రశ్నించారు. నాగసాయి బాగోతం రోజాకు, ఇతర మంత్రులకు తెలియదా? లేక తమ పార్టీ మహిళ ఏం చేసినా తప్పుకాదని వదిలేశారా? అని అనిత నిలదీశారు. సులభ్ కాంప్లెక్స్‌లకు కూడా జగన్ పేరు పెట్టే దుస్థితికి వచ్చిన వైసీపీ నేతలు, మున్ముందు బ్రహ్మోత్సవాలకు కూడా జగన్ పేరు పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. పరదాలు అడ్డుపెట్టుకొని బటన్లు నొక్కి వెళ్లిపోయే ముఖ్యమంత్రికి పుట్టినరోజు సంబరాలు అవసరమా? అని ప్రశ్నించారు. ' పబ్లిసిటీ, ప్రమోషన్లు కావాలంటే రోజా మళ్లీ జబర్దస్త్‌కు వెళ్లొచ్చు. అంతేగానీ జనం సొమ్ముతో జగన్‌ను ఎంతగా లేపాలని చూసినా, ప్రజలు లేవలేని విధంగా ఆయన్ని కప్పెట్టేస్తారని రోజా తెలుసుకుంటే మంచిదని వంగలపూడి అనిత హితవు పలికారు.

READ MORE

Cpi Strong Warning: నోరు అదుపులో పెట్టుకో.. మిస్టర్ తోపుదుర్తి!

Advertisement

Next Story