రాష్ట్ర భవిష్యత్తు కోసమే లోకేష్ పాదయాత్ర.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర

by Javid Pasha |
రాష్ట్ర భవిష్యత్తు కోసమే లోకేష్ పాదయాత్ర.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
X

దిశ, నెల్లూరు: రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన మహా యజ్ఞం యువగళం పాదయాత్ర అని ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ చార్జి బొజ్జల సుధీర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రవిచంద్ర మాట్లాడుతూ.. గందరగోళ పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు గతంలో చంద్రబాబు మీకోసం పాదయాత్ర నిర్వహిస్తే నేడు రాష్ట్ర భవిష్యత్తు కోసం లోకేష్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారని తెలిపారు. యువగళం కార్యక్రమానికి వస్తున్న ప్రజాదరణను వైసీపీ ప్రభుత్వం ఓర్వలేకపోతోందని విమర్శించారు.

జాతీయ, రాష్ట్ర రహదారులే కాకుండా మట్టి రోడ్డు మీద లోకేష్ మాట్లాడినా ఒప్పుకోమని పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని మండిడ్డారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో ఆయన దృష్టికి ప్రజలు తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించమని అధికారులను ఆదేశించిన బాధ్యతాయుత సీఎం చంద్రబాబు అని కొనియాడారు. సీఎం జగన్ పాదయాత్రలో చొక్కా పట్టుకోమని చెప్పినా, తరిమికొట్టమన్నా, కాల్చేయమని రెచ్చకొట్టినా ఏ ఒక్క పోలీసు వచ్చి జగన్ పాదయాత్రను ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదని గుర్తుచేశారు. నేడు లోకేష్ శాంతియుతంగా చేస్తున్న పాదయాత్ర పై ఇన్ని ఆంక్షలు ఎందుకని రవిచంద్ర ప్రశ్నించారు.


Advertisement

Next Story