- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara Lokesh : ఆంధ్ర మోడల్ గురించి మాట్లాడుకునేలా చేస్తా.. నారా లోకేష్
దిశ, వెబ్ డెస్క్: తల రాతను రాసేది బ్రహ్మ అయితే, తల రాతని మార్చేది గురువులు అంటారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Education Minister Nara Lokesh) అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల( Best Teachers)కు సన్మానం కార్యక్రమం(Award Program)లో పాల్గొన్న ఆయన.. విద్యాశాఖ(Education Department)పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉపాధ్యాయులను మద్యం షాపు(Liquor Shops)ల ముందు నిలబెట్టిన ప్రభుత్వాన్ని చూశామని, కానీ ఇప్పుడు ఉపాధ్యాయులను గౌరవించుకునే ప్రజా ప్రభుత్వం(NDA Govt) మీ ముందు ఉందని తెలిపారు. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని తెలిసి చాలామంది మిత్రులు విద్యా శాఖను ఎందుకు తీసుకుంటున్నావ్ ? అనేక సవాళ్ళు ఉంటాయని ఇండస్ట్రీస్, ఎనర్జీ తీసుకోండి అని అనేక సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు.
దీన్ని ఛాలెంజ్(Challenge)గా తీసుకుంటున్నానని, ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని దేశంలోనే టాప్(Top In The Country) లో నిలబెడతానని వారికి చెప్పటం జరిగిందని తెలిపారు. కేజీ టు పీజీ(KG to PG)ని త్వరలో తీసుకురాబోతున్నామని, విద్యావ్యవస్థలో అందరూ ఢిల్లీ, కేరళ మోడళ్ల గురించి మాత్రమే మాట్లాడుకుంటారని, కానీ మీ అందరి సహకారంతో ఆంధ్ర మోడల్(Andhra model) గురించి మాట్లాడుకునేలా చేస్తానని చెప్పారు. అలాగే విద్యావ్యవస్థలో చాలా మార్పులు తీసుకొస్తామని, విద్యా వ్యవస్థని రాజకీయాలకు దూరంగా పెట్టాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఇక గత ప్రభుత్వం లాగా, రంగులు, పేర్లు, ఫోటోలు పిచ్చి విద్యా శాఖలో ఉండవని, ఇప్పుడు ఈ మీటింగ్ లో కూడా ఎక్కడా మా ఫోటోలు ఉండవు గమణించాలని అన్నారు. విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని, సమాజానికి ఉత్తమ పౌరులని అందించే బాధ్యత మన అందరిపై ఉందని లోకేష్ వెల్లడించారు.