- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics:సీఎం చంద్రబాబుకు టీడీపీ నేతల ధన్యవాదాలు..
దిశ ప్రతినిధి,అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 హామీల ఫైళ్ళ పై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్న సందర్భంగా శనివారం ఉదయం 11.00 గంటలకు అనంతపురం నగరం, రాంనగర్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ..తొలి ఐదు సంతకాలతో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు నాయుడేనని, ఈ హామీల సంతకంతో చంద్రబాబు సుపరిపాలన మళ్ళీ రాష్ట్రంలో మొదలైందన్నారు. మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేసి 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకోవడం తో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
అలాగే ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయడంతో రైతులు, ప్రజల కళ్లలో ఆనంద భాష్పాలు వెల్లువెత్తాయన్నారు. సామాజిక భద్రత పెన్షన్లు రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయడంతో అవ్వ తాతలు తమ పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడును ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై 4వ సంతకం చేయడంతో అర్ధాకలితో అలమటిస్తున్న వారు చంద్రబాబు ను దీవిస్తున్నారన్నారు. నైపుణ్య గణనపై 5వ సంతకం చేసి నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చారన్నారు. అదేవిధంగా రైతులు, విద్యార్థులు, ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నాయుడు తప్పకుండా నెరవేరుస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదెన్న, రాష్ట్ర కార్యదర్శులు బుగ్గయ్య చౌదరి, జే ఎల్ మురళి, రాయల్ మురళి, స్వరూప, ఏడీసీసీ బ్యాంక్ మాజీ అధ్యక్షులు సరిపూటి సూర్యనారాయణ, రాష్ట్ర గాండ్ల సాధికార సమితి అధ్యక్షుడు గాండ్ల విశాలాక్షి, మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మొద్దీన్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య, సీనియర్ నాయకులు నాగన్న, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.