తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్!

by Jakkula Mamatha |   ( Updated:2024-04-24 10:13:14.0  )
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల గురించి మంగళవారం మీడియా ఛానల్ ప్రతినిధితో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్లీ జగన్ గెలిచే అవకాశం ఉందన్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై టీడీపీ నేత బొండా ఉమా ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో పాల్గొన్న బొండా ఉమా కేసీఆర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్కడ కేసీఆర్ కే దిక్కు లేక ఫామ్ హౌజ్‌లో మంచంపై పడుకున్నారు. ఆయన పక్కనే మరో రూమ్ రెడీ చేస్తే జగన్ కూడా అక్కడికే వస్తారు. అధికారంలో లేని ఇద్దరూ అక్కడ చింతపిక్కలు ఆడుకుంటారు అని ఎద్దేవా చేశారు. చట్టాలను అతిక్రమించే వారికి, అహంకారులకు ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు అని అన్నారు. జూన్ 4వ తేదీన జగన్ రాష్ట్రంలో ఉండటానికి ఆఖరి రోజు అని చెప్పారు. కేసీఆర్ మీ తమ్ముడు జగన్‌పై అభిమానం ఉంటే గది సిద్ధం చేయి అని సూచించారు.

Read More : అప్పట్లో వెలమ దొర.. ఇప్పుడు కోయ దొర ఒక సిలకను పెట్టుకుని జోష్యం చెప్పుకో దొర..’

Advertisement

Next Story