- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ సెటైర్లు.. సోషల్ మీడియా ట్వీట్‌లతో షేక్
రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని రాజకీయ పార్టీలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల బరిలోకి ఒంటరిగా వెళ్లాలా లేక పొత్తులతో వెళ్లాలా అనేదానిపై ఇంకా తేల్చుకోలేదు. ఇప్పటికే బీజేపీ-జనసేన పొత్తులో ఉంటే టీడీపీతో పొత్తు కోసం జనసేన ఉవ్విళ్లూరుతోంది. టీడీపీతో పొత్తుకు తాము సిద్ధంగా లేమని బీజేపీ చెప్తోంది. ఇలా మూడు పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఎలా పోటీకి వెళ్తాయో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికలకు సై అంటోంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం దూకుడు పెంచారు. తానొక సింహమని, ఎన్నికల్లో సింహంలా సింగిల్‌గానే వస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. సింహం అన్న వ్యాఖ్యలకు టీడీపీ గట్టిగా కౌంటర్ ఇస్తోంది. ట్విట్టర్ వేదికగా జగన్ వ్యాఖ్యలపై టీడీపీ సెటైర్లు వేస్తోంది. దీంతో సోషల్ మీడియా ట్వీట్‌లతో షేక్ అవుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కులాల మధ్య యుద్దం జరగడం లేదని.. పేదవాడు ఒకవైపు ఉంటే పెత్తందారులు మరోవైపు ఉండి యుద్దం జరుగుతున్నదని సీఎం జగన్ అన్నారు. మాట మీద నిలబడే జగన్ ఒకవైపు .. వెన్నుపోటు, మోసం మరోవైపు ఉండి యుద్దం జరుగుతున్నదని చెప్పుకొచ్చారు. 'నాకు ఎలాంటి పొత్తులు లేవు.. మీ బిడ్డ సింహంలా ఒక్కడే నడుస్తాడు...' అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్షాల పొత్తుపై సెటైర్లు వేశారు. తోడేళ్లందరూ ఒక్కటవుతున్నారు.. కానీ నాకు భయం లేదు అని జగన్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు టీడీపీ గట్టి కౌంటర్ ఇస్తోంది.
ఫ్రస్ట్రేషన్‌తో సింహంగా వర్ణించుకుంటున్న జగన్: అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర
వెనకటికి ఎవడో.. తల్లిదండ్రుల్ని చంపేసి, నాకెవరూ లేరు, నాపై జాలి చూపించండంటూ జడ్జి ముందు దేబిరించినట్లుంది జగన్ రెడ్డి వ్యవహార శైలి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటేసి, నేను సింహాన్ని, సింగిల్‌గా ఉంటానని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. చేసిన పాపాలు... పాల్పడిన దారుణాలు.. వేసిన భారాలు భరించలేక అందరూ నిన్ను దూరం పెడితే సింగిల్‌గా మిగిలావు అని వ్యాఖ్యానించారు. ఆ ఒంటరితనం నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్‌తో నేను సింహాన్ని, సింగిల్‌గా వస్తున్నా అంటూ సినిమా డైలాగులు వాగుతున్నావ్ అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 'జగన్ రెడ్డీ... నువ్వు సింహానివి కాదు, పులివెందుల పిల్లివి.. పిరికి సన్నాసివి. జనమంటే భయం కాబట్టే డేరాల్లో దాక్కుంటూ ఏపీ డేరాబాబా అయ్యావు. గాలిని చూసి కూడా భయపడుతున్నావు కాబట్టే చెట్లను కూడా నరికిస్తున్నావు...' అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర కామెంట్ చేశారు. 70 ఏళ్లుదాటినా ఎప్పుడూ జనంలో ఉండే చంద్రబాబు ముసలాయనా? జనాన్ని చూసి భయపడే నువ్వు ముసలోడివా జగన్ రెడ్డీ? జనం మెచ్చిన నేత చంద్రబాబు గురించి జైలు పక్షివైన నీకేం తెలుసు? బాబాయ్ హత్యకేసులో తన బాగోతం బయటపడకూడదనే సింహం సింగిల్‌గా ఢిల్లీ వెళ్లింది... అంటూ కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనారణ్యం నుంచి ప్రజలే తరిమికొడతారు: బీటెక్ రవి, అమర్‌నాథ్ రెడ్డి
'బాబాయ్‌ని పైకి పంపేశావు. తల్లిని తరిమేశావు. చెల్లిని గెంటేశావు. సొంత కుటుంబ సభ్యుల్నే వెంటాడి వేధించి పంపించేశాక అమాయక జీవుల్ని తినేసిన సింగిల్ సింహంలా కాక గంగిగోవులా ఎలా ఉంటావు జగన్ మోసపు రెడ్డీ...' అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు. 'సింగిల్ సింహం వస్తే పచ్చని చెట్లు మోడులైపోతాయి. పరిసరాలన్నీ పరదాలు చుట్టుకుంటాయి. షాపులన్నీ మూతబడతాయి. ప్రజాస్వామ్యంపై పంజా విసిరిన మృగరాజుకు రోజులు దగ్గరపడ్డాయి...' అని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శించారు. 'బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావడం ఖాయమన్నాడు సుమతీ శతకకారుడు. హింసించి ప్రాణాలు తీసే సింగిల్ సింహాన్ని జనారణ్యం నుంచి తరిమికొట్టడానికి ప్రజలే సిద్ధం అవుతున్నారు...' అని మాజీమంత్రి అమర్‌నాథ్ రెడ్డి హెచ్చరించారు. సింహం సింగిల్‌గా వస్తుందన్నందుకు సీఎం వైఎస్ జగన్‌ను టీడీపీ టార్గెట్ చేసి సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేస్తోంది.
Also Read...
దూసుకుపోతున్న యువ నేతలు.. Chandrababu పిలిపించుకుని మెచ్చుకోవడంతో...